![]() |
![]() |

గీతూ రాయల్ పేరు వింటే చాలు ముందుగా గుర్తొచ్చేది బిగ్ బాస్ సీజన్ 6 .. ఇందులో ఆమె ఏడ్చిన ఏడుపులు, అరిచిన అరుపులు ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి గీతూ రెగ్యులర్ గా తన బిగ్ బాస్ సీజన్ కి సంబంధించిన ఫొటోస్ ని, వీడియోస్ ని తరచూ అప్ లోడ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక వీడియో పోస్ట్ చేసి "ఈ ఎపిసోడ్ లో నా ఏడుపు చూసే నాకు ఏడుపొస్తోంది" అని ఫన్నీగా పెట్టుకుంది. తర్వాత చాలా రోజులయ్యింది మాట్లాడుకుని మాట్లాడుకుందామా" అని అడిగింది " ఏం చేస్తున్నావ్ ఈ మధ్య కాలంలో" అనేసరికి "బిగ్ బాస్ అన్ని సిరీస్ చూస్తున్నా..వెబ్ సిరీస్ చూస్తున్నా..హరీపాటర్ చూసా ఏం తీశాడులే సినిమా ..అందులో ఉన్నట్టు నాకు మంత్రాలు వచ్చి ఉండాలి అనుకుంటున్నా" అని చెప్పింది.
"బ్లూ టిక్ మీద మీ అభిప్రాయం ఏమిటి" అని అడిగేసరికి "అందరికీ బ్లూ టిక్ రావాలనే ఆశ ఉంటుంది. నాకు కూడా ఒక టైంలో బ్లూ టిక్ ఎప్పుడొస్తుందా నేను ఎప్పుడు ఫేమస్ అవుతానా అనే ఆశ ఉండేది...ఇక నాకు బ్లూ టిక్ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉంది. జీవితం అంతా కలగన్నాను కదా ఈ బ్లూ టిక్ కోసం అనుకున్నా..నాకు బ్లూ టిక్ వచ్చిన టు మంత్స్ కే 700 కే బ్లూ టిక్ అమ్మేస్తుంటే చాలా బాధగా అనిపించింది..ఏడాది మొత్తం కష్టపడి చదివిన వాడు, స్లిప్ పెట్టి రాసిన వాడు ఇద్దరూ ఒకటే ఐపోయినట్టు ఉంది పరిస్థితి " "ఆదిరెడ్డిని మిస్ అవుతున్నారా" "అవును..హైదరాబాద్ లో ఉంటే తరచూ కలిసేవాళ్ళం..కానీ నెల్లూరులో ఉండిపోయాడు కదా..కొన్ని బిజినెస్ లు స్టార్ట్ చేస్తున్నాడు. ఒక ఇల్లు కడుతున్నాడు..ఆ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు" "బిగ్ బాస్ ని మిస్ అవుతున్నారా ..బిగ్ బాస్ ఓటిటికి ఛాన్స్ వస్తే వెళ్తారా.."బిగ్ బాస్ నుంచి వచ్చిన త్రి మంత్స్ వరకు చాలా మిస్ అయ్యాను...నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చినా వెళ్ళను..." అని చెప్పింది గీతూ..
![]() |
![]() |